Maama Mascheendra Teaser: రిలీజ్..ఐ హేట్ లవ్ అంటున్న హీరో
సుధీర్ బాబు(sudheer babu) నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర నుంచి టీజర్(Mama Mascheendra Teaser) విడుదలైంది. స్టార్ హీరో మహేష్ బాబు(mahesh babu) ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో నటించిన ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో ఓ సారి లుక్కేయండి మరి.
వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు(sudheer babu) తాజాగా మరో సరికొత్త కాన్సెప్టుతో వస్తున్నాడు. అదే మామ మశ్చీంద్ర(Mama Mascheendra). ఈ చిత్రంలో సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లలో యాక్ట్ చేయడం విశేషం. అయితే ఈ మూవీ టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్(mahesh babu) లాంచ్ చేశారు. ఇక టీజర్ వీడియో మూడు జన్మల రాక్షస బతుకే మిన్నా అనే డైలాగ్ లో మొదలవుతుంది.
వేగం ఎక్కువైతే ఆగం అయితవ్ కాక అని సుధీర్ బాబు(sudheer babu) చెబుతున్న సంభాణషలు ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు గల్ ఫ్రెండ్ పక్కనుంటే ఎవ్వడైనా రాముడే, ఐ హేట్ లవ్ అంటున్న సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
సుధీర్ బాబు మూడు విభిన్నమైన అవతారాల్లో(three characters) ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. వారిలో ఒకటి స్థూలకాయుడు, మరొకటి పరశురామ్ వృద్ధుడు, ఇంకోటి DJ యువకుడుగా పలు రకాల వేషాల్లో ఉన్నారు. ఈ మూడు పాత్రలను టీజర్లో చూపించారు. వీరిలో ఒకరు ప్రియురాలి కోసం తహతహలాడుతుండగా, DJ.. అమ్మాయిల నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు ముసలి డాన్ ఈ ఇద్దరిని చంపాలనుకుంటాడు. అయితే ఎందుకు వారిని చంపాలను కుంటాడు ? అసలు స్టోరీ ఎంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాలో హీరోయిన్లుగా మీర్నాళిని రవి(Mirnalini Ravi), ఈషా రెబ్బా(Eesha Rebba) నటించారు. హర్షవర్ధన్(Harsha Vardhan) రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ భాషలో కూడా విడుదల కానుంది.