సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా వెండితెరకు హీరోగా పరిచయమై సుధీర్ బాబు.. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. తన బిరుదు నైట్రో స్టార్ అని ఉండగా.. ఇప్పుడు మరోసారి కొత్త ట్యాగ్ ఇచ్చుకున్నాడు.
Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ అటెంప్ట్‌తో మెప్పిస్తున్నాడు. కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే.. ఒక నటుడిగా మాత్రం ఒక్కో సినిమాకి చాలా వేరియేషన్ని చూపిస్తు వస్తున్నాడు. లేటెస్ట్గా హరోం హర అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు సుధీర్. అయితే.. ఆ మధ్య అందరి హీరోల్లాగే తనకు కూడా నెట్రో స్టార్ అనే ట్యాగ్ పెట్టుకున్నాడు సుధీర్. గత రెండు మూడు సినిమాల నుంచి నైట్రో స్టార్‌గానే టైటిల్ కార్డ్ వేసుకున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి తన ట్యాగ్‌ని మార్చుకున్నాడు. ‘హరోం హర’ సినిమాతో కొత్త ట్యాగ్‌ను వేసుకున్నాడు. హరోం హర టైటిల్ కార్డ్‌లో ‘నవ దళపతి’ సుధీర్ బాబు అని పడింది.
దీంతో.. ఇక నుంచి సుధీర్ టాగ్లైన్ నైట్రో స్టార్ కాకుండా.. నవ దళపతిగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం సుధీర్ కొత్త ట్యాగ్ వైరల్‌గా మారింది. ఒక్క సుధీర్ అనే కాదు.. ఇమేజ్‌కు తగ్గట్టుగా ట్యాగ్స్ మార్చుకుంటున్నారు మన స్టార్ హీరోలు. ఇటీవలే శర్వానంద్‌కి ‘చార్మింగ్ స్టార్’ టాగ్లైన్ ఇచ్చారు. అలాగే.. పుష్ప పార్ట్ 1 వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ ట్యాగ్స్ అందుకున్నారు. అంతేకాదు.. దేవర నుంచి యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారగా.. గేమ్ చేంజర్‌తో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ బిరుదులతో దూసుకుపోతున్నాడు. మరి నవ దళపతిగా సుధీర్ ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటాడో చూడాలి.