Love Birds : ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అనుకుంటారు. జీవితంలో పెళ్లి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి.. కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒక జంట మాత్రం ఆస్పత్రిలో పెళ్లి చేసుకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురి కావడంతో... ఆస్పత్రిలోనే వీరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అనుకుంటారు. జీవితంలో పెళ్లి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి.. కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒక జంట మాత్రం ఆస్పత్రిలో పెళ్లి చేసుకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురి కావడంతో… ఆస్పత్రిలోనే వీరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లా భావ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటా గ్రామానికి చెందిన మధు రాఠోడ్‌తో పెళ్లి నిశ్చయమైంది. దాంతో ఇరువురు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, పెళ్లికి ఇంకా ఒక రోజు ఉందనగా వధువుకు చిన్న ప్రమాదం జరిగింది.
దాంతో ఆసుప్రతి పాలైంది. వధువు మెట్లపై కాలు జారిపడడంతో రెండు చేతులు విరిగిపోయాయి. ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆస్పత్రిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో వధవు చికిత్స పొందుతున్న వార్డులోనే ఓ రూమ్‌ను బుక్ చేసి అలకంరించారు. వరుడు ఊరేగింపుగా వచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ పెళ్లి తాలూకు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.