Rain in Hyd:హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం (Rain) కురిసింది. గాలి దుమారం వీచింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో పలు చోట్ల కరెంట్ తీసివేశారు. దీంతో జనం (people) ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం పూట సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జగద్గిరిగుట్టలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి (kukatpally), చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, చందానగర్, మియాపూర్‌లో వర్ష ప్రభావం ఉంది. మరో రెండు, మూడు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, బాలానగర్, పటాన్ చెరు, అల్వాల్, మల్కాజిగిరి, పంజాగుట్ట, కాప్రా తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.
అత్యవసరమైతే 040-29555500 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. హొల్డింగ్స్ ఉన్న చోట ఉండొద్దని కోరుతున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లిలో గాలిదుమారం ఉండగా.. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో రెయిన్ అలర్ట్ జారీ చేశారు.
జనగామ, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా బీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మేకలు మృతి చెందాయి.