»Rahul Dravids Epic Response To Journalists Question On Left Arm Pacers
Rahul Dravid: జర్నలిస్ట్ ప్రశ్నకు ద్రావిడ్ అదిరిపోయే సమాధానం
మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ద్రావిడ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
జహీర్ ఖాన్ (zaheer khan) తర్వాత టీమిండియాలో (Team India) లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు (left arm bowlers) కుదురుకున్న సందర్భాలు తక్కువే. ఇంకా చెప్పాలంటే జహీర్, ఆశిష్ నెహ్రా (ashish nehra), ఆర్బీ సింగ్ (rp singh), ఇర్ఫాన్ పఠాన్ (irfan pathan).. వీరంతా లెఫ్ట్ ఆర్మర్లు. వీరి తర్వాత సరైన ఎడమ చేతి వాటం బౌలర్ కనిపించడం లేదు. అర్షదీప్ సింగ్ (arshdeep singh) రూపంలో ఓ స్థిరమైన బౌలర్ దొరికినప్పటికీ.. వన్డేలు, టీ20లకు పరిమితం. దీంతో జహీర్ తర్వాత అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. భారత్ – ఆస్ట్రేలియా రెండో టెస్టు ప్రారంభానికి ముందు జట్టులో కీలకమైన… మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను (Rahul Dravid) ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ద్రావిడ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
‘లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉంటే వేరియేషన్స్ తీసుకు రాగలడు. జర్నలిస్టులు అందరూ షహీన్, స్టార్క్ వంటి పేర్లను చెబుతున్నారు. కానీ జహీర్ ఖాన్‌ను మరిచిపోయారు. అయినప్పటికీ సెలక్టర్లు, బీసీసీఐ మేనేజ్మెంట్ కచ్చితంగా టాలెంట్ కలిగిన బౌలర్ కోసం అన్వేషిస్తోంది. అర్షదీప్ సింగ్ టీ20లు, వన్డేలలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీల్లోను నాలుగైదు వికెట్లు తీసేవాడు. అర్ధదీప్ యువకుడు… క్రమంగా నేర్చుకుంటున్నాడు… ఎదుగుతున్నాడు. మరింత మంది యంగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కోసం సెలక్టర్లు చూస్తున్నారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయినంత మాత్రాన జట్టులో స్థానం దక్కదు. బౌలింగ్ ప్రదర్శన ఉండాలి. జహీర్, ఆశిష్ నెహ్రా.. వంటి వారిని కేవలం లెఫ్ట్ ఆర్మర్లు అని జట్టులోకి తీసుకోలేదు. వారు అద్భుతంగా రాణించారు.’ అని చెప్పారు.
ద్రావిడ్ సమాధానం చెబుతుండగా జర్నలిస్ట్ కలుగజేసుకొని, టీమిండియా పైన ఆసిస్ జట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ప్రభావం చూపారని గుర్తు చేశాడు. దీనికి లెజెండరీ క్రికెటర్ కూడా వెంటనే స్పందించాడు. ‘మీకు తెలిసి ఎవరైనా 6 అడుగుల 4 అంగుళాల పొడుగు ఉన్న లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఉంటే మాకు చెప్పండి. మీరు మిచెల్ స్టార్క్, షహీన్ అఫ్రీది పేర్లను తీసుకున్నారు కదా.. కానీ మన దేశంలో ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు ఉండి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నవారు అరుదు. మేం సరైన బౌలర్ కోసం చూస్తున్నాం. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు మంచి వైవిద్యం చూపిస్తారు. కానీ మీరు చెప్పినట్లుగా అలాంటి పొడుగువారు దొరకరు. సెలక్షన్ కమిటీ అన్వేషిస్తోంది.’ అన్నారు.
శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌లో పాస్ అయితే తిరిగి జట్టులోకి వస్తాడని చెప్పారు. గత నెలలో శ్రీలంకతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లో అయ్యర్ వెన్నెముకకు గాయమైంది. నేషనల్ క్రికెట్ అకాడమిలో నెల రోజులపాటు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఉన్నాడు. గాయం నుండి కోలుకొని తిరిగి వస్తే జట్టుకు ఉపయోగమే అన్నారు. కాగా, ఆస్ట్రేలియా – భారత్ రెండో టెస్ట్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయి. కోట్ల మైదానాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్ పరిశీలించారు.