రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షోభ సమయంలోనూ విధులు మరవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
Ashok Gehlot:రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను (Ashok Gehlot) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షోభ సమయంలోనూ ఆయన విధులు మరవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (sachin pilot) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలో (rajasthan) మొదటి వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఈ రైలును ప్రధాని మోడీ (modi) వర్చువల్‌గా ప్రారంభించి.. మాట్లాడారు. గెహ్లాట్ తనకు మంచి మిత్రుడు అని మోడీ తెలిపారు.
జైపూర్ జంక్షన్ రైల్ స్టేషన్లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ (ashwin viashnav), రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా (kalraj misra) ఇతరులు పాల్గొన్నారు. రైల్వే మంత్రి, బోర్డు చైర్మన్ ఇద్దరు కూడా రాజస్థాన్‌కు చెందినవారేనని మోడీ (modi) తెలిపారు. మీ రెండు చేతుల్లో లడ్డూలు (laddoos) ఉన్నాయని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఇప్పటివరకు చేయలేదు. తన మీద నమ్మకం ఉన్నందున ఈ రోజు తన ముందు ఉంచారు. మీ నమ్మకమే తన బలం.. స్నేహాంపై మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలను తెలియజేశారు.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ (sachin pilot) నిన్న ఒకరోజు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి గెహ్లట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయం పార్టీ సీనియర్లకు కూడా చెప్పానని పేర్కొన్నారు. తమకేం చెప్పలేదని రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జీ నిన్న స్పందించారు. సచిన్ పైలట్ (sachin pilot) దీక్ష స్థలిలో కాంగ్రెస్ పార్టీ గుర్తు, బొమ్మ లేకపోవడం విశేషం. 2018లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటీ నుంచి గెహ్లట్ (gehlot) వర్సెస్ పైలట్ (pilot) మధ్య గొడవ జరుగుతోంది. సీఎం పీఠం కోసం సచిన్ పైలట్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. సోనియా (sonia) అండదండలు గెహ్లట్ వైపే ఉండటంతో ఆయనే సీఎం అయ్యారు.