బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్‌లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
sukesh chandrasekhar:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) ఓ కుదుపు కుదిపేసింది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్లను ఆప్‌కు ఇచ్చిందని ఈడీ (ed) ఆరోపిస్తోంది. కాదు 2020లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ టీఆర్ఎస్ పార్టీకి రూ.15 కోట్లు (15 crores) ఇచ్చారని మనీ ల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ (sukesh) ఇటీవల బాంబ్ పేల్చాడు. అతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ ఇంగ్లీష్‌లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
కవితతో (kavitha) చాట్ చేసిన స్క్రీన్ షాట్లను సుఖేశ్ బయటపెట్టాడు. డబ్బు డెలివరీ చేశానని ఆమెకు మెసేజ్ చేశాడు. కవిత (kavitha) సైడ్ నుంచి మనీష్‌తో మాట్లాడాను అని రిప్లై ఆ చాట్‌లో కనిపిస్తోంది. దాదాపు తెలుగులోనే టైపింగ్ ఉంది. కవితను (kavitha) అక్క అని చాట్‌లో పిలిచాడు. సుఖేశ్ స్వస్థలం బెంగళూర్ (bengalure) కాగా.. అతనికి తెలుగు రాదు. మరీ తెలుగులో ఎలా చాట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది బీజేపీ కుట్ర అని కొట్టిపారేస్తున్నారు.
బెంగళూర్ భవానీనగర్‌కు చెందిన రబ్బర్ కాంట్రాక్టర్ కుమారుడే సుఖేశ్ చంద్రశేఖర్ (sukesh). 17 ఏళ్ల వయస్సులోనే నేర జీవితం ప్రారంభించాడు. పారిశ్రామిక వేత్తలు, సినీ తారలను మోసం చేశాడని తెలిసింది. సెక్రటరీ అని పరిచయం చేసుకొని.. కాంట్రాక్టులు, బెయిల్ ఇప్పిస్తానని దోచుకునేవాడట. జయలలిత మృతిచెందాక అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండు ఆకులను ఇప్పిస్తానని టీటీవీ దినకరన్‌తో రూ.50 కోట్ల డీల్ కుదుర్చుకొని పోలీసులకు దొరికిపోయాడు. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నాడు. 2020, 2021లో జైలు నుంచి ఫోన్లు, గొంతు మార్చే పరికరాల సాయంతో ర్యాన్ బాక్సీ యాజమాని శివిందర్ సింగ్ భార్యకు ఫోన్ చేసి బెయిల్ ఇప్పిస్తానని రూ.200 కోట్లు తీసుకున్నాడు.
ఆప్ (aap) తరఫున రూ.15 కోట్లు బీఆర్ఎస్ నేతలకు ఇచ్చాడట. హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ నేత ఇంట్లో ఉండేవాట. నోవాటెల్ వెళ్లి మహిళలతో చిల్ అయ్యేవాడని తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికు కాస్ట్లీ గిప్ట్స్ ఇచ్చి బుట్టలో వేసుకున్నాడని తెలిసింది.