»Prasadam Of Small Grains Sale Of Gold And Silver Coins Started In Yadadri Temple
Yadadri temple:లో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల విక్రయం షురూ
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం(yadadri temple)లో ఈరోజు చిరుధాన్యాల ప్రసాదం(మిల్లెట్స్), బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(indrakaran reddy) చిరుధాన్యాల అమ్మవారి ప్రసాదం, బంగారు, వెండి నాణేల విక్రయాలను ప్రారంభించారు. ఆలయంలో వెబ్ పోర్టల్, ఆన్లైన్ టిక్కెట్ సేవలను ఈ సందర్భంగా మంత్రి ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతోపాటు పలువురు పండితులు, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ఆలయం(yadadri temple)లో స్వామివారి దర్శనం చేసుకున్న మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి ఆలయ ఈఓ, అర్చకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పీఠాధిపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మంత్రిని ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఆయనకు ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో యాదాద్రిలో ఈరోజంతా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించి, ఆన్ లైన్ టికెట్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు.