»Celebridades Visitadas Por Sri Lakshmi Narasimha Swamy
Yadadri: యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సేవలో ప్రముఖులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) వారిని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తోందని తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలియజేశారు.
యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి(Shri Ganapati Satchidananda Swami) యాదాద్రి గర్భాలయంలోని స్వయంభువుగా వెలసిని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) ఆలయానికి చేరుకున్న గణపతి సచ్చిదానంద స్వామికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని సచ్చిదానంద స్వామి పరిశీలించారు. దైవ నామాలతో భక్తులకు ప్రవచనాలను వినిపించారు.
అలాగే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) వారిని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తోందని తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలియజేశారు.
లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) అభిషేకానికి హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన భక్తుడు శ్రీగిరి శ్రీనివాసాచారి దంపతులు 2 కిలోల 675 గ్రాముల వెండి బిందెను ఆలయానికి అందజేశారు. స్వామివారికి నిత్యారాధనలో నిత్యాభిషేకాలు, సుదర్శన నారసింహ హోమం, ఏకాదశి పురష్కరించుకుని లక్ష పుష్పార్చనను ఘనంగా ఆలయ అధికారులు నిర్వహించారు.