సినీ పరిశ్రమ (Movie Industry)లో మరో విషాదం అలుముకుంది. ‘మిథునం’ (Mithunam Movie) చిత్ర నిర్మాత, స్వచ్ఛంద సేవకుడు ముయిద ఆనంద రావు (57) (Anand Muyida Rao) తుదిశ్వాస విడిచాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్టణం (Visakhapatnam)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. స్వచ్ఛంద కార్యక్రమాలతో అందరి అభిమానం పొందిన ఆనంద రావు మృతికి సినీ ప్రముఖులతో పాటు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.
విజయనగరం జిల్లా (Vizianagaram District) రేగిడి మండలం వావిలవలస (Vavilavalasa) గ్రామంలో జన్మించిన ఆనందరావు ప్రైవేటు బ్యాంక్ లో చిరుద్యోగిగా జీవితం మొదలుపెట్టాడు. అనంతరం వ్యాపారవేత్త (Businessman)గా రాణించాడు. వాటితో పాటు సేవా కార్యక్రమాలు (Helping Programmes) చేస్తూ మంచి పేరు పొందారు. కాగా ఆనందరావుకు మొదటి నుంచి సాహిత్యం (Literature) పై మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి ‘కోటిగాడు’ (Kotigadu) అనే పేరుతో ప్రచురణ వేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam), లక్ష్మి (Lakshmi) కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మిథునం’ 2012లో విడుదలైంది. విదేశాల్లో ఉండే కన్నపిల్లల రాక కోసం తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తం తనికెళ్ల భరణి (Tanikella Bharani) మిథునం సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా అందరి గుండెలను కదిలించింది. ఈ సినిమాకు నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆయనకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. కాగా ఆనందరావు మృతిపై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే జోగులు, ఇతర సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గురువారం ఆనందరావు అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. ఆయన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి గ్రంథాలయం నిర్మించారు.