భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సకల కోరికలను తీర్చే కల్పవృక్షం(Kalpavruksham) శక్తి సామర్థ్యాలను భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. స్వామివారికి ఈ కల్పవృక్షం ఎంతో ప్రీతికరమైంది. అందుకే పొన్న వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
శనివారం ఉదయం నుంచి స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో ఐదో రోజైన శనివారం మురళీమోహనుడిగా స్వామివారు భక్తులకు కనిపించారు. అలాగే రేపు జగన్మోహుడి అలంకారంలో స్వామి(lakshmi narasimha swamy)వారు కనిపించనున్నారు. రేపు రాత్రి అశ్వవాహనంపై ఊరేగనున్నారు. అలాగే 28వ తేదిన తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1వ తేదిన దివ్య విమాన రథోత్సవం జరగనుంది. స్వామివారు శ్రీమహా విష్ణువు అవతారంలో గరుడవాహన సేవ(Garuda vahana seva) ద్వారా భక్తులను అనుగ్రహించనున్నారు. మార్చి 3వ తేది ఉత్సవాలు ముగుస్తాయి.