ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు.
భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండగా భట్రాజు పొగడ్తలు అని అనంత శ్రీరామ్ పలకడంతో ఆయనపై భట్రాజు కుల సంఘాలు ఫిర్యాదు చేశాయి.