»Parents Appeal To Extend School Holidays In Ap From Tomorrow Till 11 30
Ap Schools: ఏపీలో రేపటి నుంచి 11.30 వరకే స్కూళ్లు..సెలవులు పొడిగించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వేసవి సెలవులు పొడిగించాలని ఏపీ సర్కార్ ను కోరుతున్నారు.
విద్యార్థుల(Students)కు ఇచ్చిన వేసవి సెలవులు(Summer Holidays) ఈ రోజుతో పూర్తవుతాయి. రేపటి నుంచి పాఠశాలలు(Schools) తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్(AP Government) కీలక ప్రకటన చేసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జూన్ 17 వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకే తరగతులు ఉంటాయని వెల్లడించింది.
రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) విద్యార్థులకు ఉదయం రాగి జావ(Raagi Malt) ఇవ్వనున్నారు. దానికి సంబంధించి ఏపీ సర్కార్(AP Government) ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో స్కూళ్ల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ తరుణంలోనే స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
జూన్ రెండో వారం గడిచినా కూడా ఏపీ(AP)లో ఇంకా ఎండల తీవ్రత తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు(Temperature) రోజూ నమోదవుతూ వస్తున్నాయి. ఎండ తీవ్రతకు స్కూళ్లకు వెళ్లే క్రమంలో విద్యార్థులు(Students) అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రుల్లో(Parents) ఆందోళన చెందుతున్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా వేసవి సెలవులను పొడిగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.