హోలీ పండుగలో తోటి నటీనటులు, సినీ ప్రముఖులతో సందడిగా గడిపిన ఆయన తెల్లారేసరికి కన్నుమూశాడు. వందకు పైగా సినిమా (Movies)ల్లో నటించి.. దాదాపు ఆరు సినిమాలకు దర్శకత్వం (Direction) వహించిన ఆయన మృతితో బాలీవుడ్ (Bollywood) సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపంతో ఆమెపై దాడి చేశాడు. వెంటనే ఆమె ముక్కు కొరికేశాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఉన్న వారు ఏం జరిగిందో గుమిగూడారు. అనంతరం చంద్రశేఖర్ అక్కడి నుండి పారిపోయాడు.
తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వెండితెరపై హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో బుల్లితెరపై కూడా లేడీ యాంకర్ల(Lady Anchor)కు అంతే క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. ఈ బుల్లితెర యాంకర్స్ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకునేవారిలో యాంకర్ లాస్య(Anchor Lasya) కూడా ఒకరు. ఈ టాలీవుడ్(Tollywood) స్టార్ యాంకర్ మరో బిడ్డకు జన్మనిచ్చింది. హోలీ పండగ సందర్భంగా యాంకర్ లాస్య(Anchor Lasya) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
MLA Ganesh Guptha : మహిళా దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా... కవిత కు నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఈడీ అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈడీ అధికారులు తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత బాగా ఉందో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బట్టే తెలుస్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ 'తెలంగాణ తలవంచదు' ట్వీట్ చేశారు.
వీ హబ్ కు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ స్టార్టప్ తో దాన్ని రూ.70 కోట్లకు పెంచారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకువెళ్లాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. మార్చి 28 నుంచి పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ Amazon వీడియో, Apple TV, Vudu, Movies Anywhereతో సహా ప్రధాన ఓటీటీలలో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే 16 డిసెంబర్ 2022న థియేటర్‌లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది.
H3N2 ఇన్‌ఫ్లుయెంజా కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. హాస్పిటల్స్ శ్వాస కోశ సమస్యలతో హాస్పిటల్స్ లో చేరుతున్న చాలామందికి H3N2 రకం వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది.
మంచి ఎవరూ చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని తెలిపాడు. రైతుల శ్రేయసు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటానని ప్రకటించాడు. కాగా పార్టీ సస్పెండ్ తో రాము బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నాడని సమాచారం.
కల్వకుంట్ల కవిత (K Kavitha) చేస్తున్న డిమాండ్ కు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు పలికారు. కవిత చేస్తున్న డిమాండ్ నే పవన్ చేశాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరాడు. ఇదే విషయమై తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంచినట్లు తెలిపాడు.
OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.