»Madhya Pradesh Gwalior Family Court Asks Man To Stay With Both Wives For 3 Days Each
Madhya Pradesh:ఒక్కో భార్య వద్ద 3 రోజులు ఉండాలన్న కోర్టు, ఆదివారం ఆ భర్తకు సెలవు
మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే... ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.
మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే… ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. భర్త, ఇద్దరు భార్యలకు కౌన్సెలింగ్ (counselling) అనంతరం ఫ్యామిలీ కోర్టు (family court) ఈ నిర్ణయం తీసుకున్నది.
భర్త హర్యానాలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి (multinational company employee). ఇంజీనిర్ గా (engineer in multinational company) వర్క్ చేస్తున్నాడు. అతను 2018లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు రెండేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2020 కరోనా లాక్ డౌన్ (Covid lock down) సమయంలో ఆ భార్య తన భర్తను వదిలేసి, తన పుట్టిల్లు గ్వాలియర్ వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ హర్యానాకు వచ్చింది. ఈ కాలంలో సదరు భర్త తన ఆఫీస్ లోనే మరో మహిళతో సంబంధం నెరిపాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య హర్యానాకు వచ్చాక… తన భర్త ఆయన ఆఫీస్ లోనే మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్నది. భర్తతో గొడవపడి ఫ్యామిలీ కోర్టును (Family Court) ఆశ్రయించింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని, తనకు భరణం ఇప్పించాలని భార్య ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ప్యామిలీ కోర్టు కౌన్సిలర్ హరీష్ దేవన్ కు ఆరు నెలల క్రితం చేరింది. నెలల పాటు భార్యలు, భర్తతో చర్చించారు. చివరకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదే వారంలోని ఏడు రోజుల్లో ఇద్దరు భార్యల వద్ద చెరో మూడు రోజుల చొప్పున ఉంటాడు. ఆదివారం తన మాత్రం ఇక భర్త ఇష్టం.
ఈ అగ్రిమెంట్ తర్వాత భర్త, భార్యలు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని, అలాగే అతను తన ఇద్దరి భార్యలకు చెరో ఫ్లాట్ ఇచ్చాడని కౌన్సిలింగ్ చేసిన హరీష్ తెలిపారు. అతను ఇక నుండి ఇద్దరు బాగోగులు చూసుకుంటాడని వెల్లడించారు.