»Telangana Highcourt Orders To Megastar Chiranjeevi On Land Dispute
స్థల వివాదంలో MegaStar చిరంజీవి.. తెలంగాణ హైకోర్టు మందలింపు
సినీ కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను సినీ రంగ ప్రముఖులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. తమకు భూములు ఇవ్వకుండా పెద్దలే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ (Cine Industry)కు సంబంధించిన భూ వ్యవహారాలు న్యాయస్థానా (Courts)ల్లో కొనసాగుతున్నాయి. ఇక సినీ రంగ ప్రముఖులు భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల దగ్గుబాటి సురేశ్ బాబు (D Sureshbabu), వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) భూమి వ్యవహారం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పరస్పరం ఫిర్యాదులు చేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వారికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. అది మరవకముందే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మందలించింది. ఓ భూమి వివాదంలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (Jubilee Hills Housing Society)లో 595 గజాల స్థలంపై వివాదం కొనసాగుతున్నది. ప్రజా అవసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆ స్థలాన్ని సొసైటీకి అప్పగించింది. అయితే ఆ స్థలాన్ని సొసైటీ చిరంజీవికి విక్రయించింది. ఆ స్థలంలో చిరంజీవి నిర్మాణాలు చేపట్టడంతో జె.శ్రీకాంత్ బాబు అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అతడితో పాటు మరికొందరితో కలిసి శ్రీకాంత్ బాబు చిరంజీవిపై పిటిషన్ వేశారు. కాగా ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు కొనసాగాలని చిరంజీవికి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి కోర్టు సూచించింది.
ఫిర్యాదుదారుల పిటీషన్ ను మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం వివాదాస్పద స్థలంలో ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్ఎంసీని ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది. కాగా సినీ కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను సినీ రంగ ప్రముఖులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. తమకు భూములు ఇవ్వకుండా పెద్దలే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.