»Mlc Kavitha Who Went To Delhi In March 15th Ed Arrests Kavitha Before Ugadi Festival
MLC Kavitha: మళ్లీ ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..ఉగాదికి ముందే అరెస్టు!
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మళ్లీ ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(delhi liquor scam case)లో రెండో విడత విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరు కావడానికి ఒకరోజు ముందే బయలు దేరారు. మార్చి 15న ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. దీంతోపాటు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీలోని హోటల్ లే మెరిడియన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరోసారి చట్టసభల్లో మహిళా బిల్లు పెట్టాలని ఆందోళన(proetest) చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదే మహిళా బిల్లు అంశంపై జంతర్‌మంతర్‌లో గతంలో జరిగిన ఒక రోజు నిరాహారదీక్ష తర్వాత ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని(round table conference) నిర్వహిస్తున్నారు. దీనికి గతంలో బిల్లును వ్యతిరేకించిన వారితో సహా అనేక ప్రతిపక్షాలు హాజరకానున్నట్లు తెలిసింది. అయితే ఆహ్వానం ఉన్నప్పటికీ కవిత నిరసనకు కాంగ్రెస్(congress party) దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో మార్చి 11న కవితను తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ(ED), మార్చి 16న మళ్లీ ఆమెకు సమన్లు పంపింది. ఆమె ఫోన్‌ను కూడా సమర్పించాలని కోరారు. అదే రోజు రాత్రి ఆమె తన సోదరుడు కెటి రామారావు(KTR), బీఆర్ఎస్(BRS) క్యాబినెట్‌లోని ఇతర మంత్రులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తన తండ్రి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు(KCR) సమాచారం ఇవ్వడానికి ప్రగతి భవన్‌కు వెళ్లారు. అయితే తెలంగాణ(telangana)లో ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగడం పట్ల రాజకీయ పగతోనే కవితను విచారిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుండగా కవిత అరెస్ట్ ఆసన్నమైందని మార్చి చివరి వారంలో వచ్చే తెలుగు పండుగ ఉగాదికి(Ugadi festival) ముందే అది జరుగుతుందని తెలంగాణ బీజేపీ(BJP) నేతలు అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఆమె చేసే నిరసనలు కేవలం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి దృష్టి మళ్లీంచేందుకేనని చెబుతున్నారు. ED ప్రకారం కవిత సౌత్ గ్రూపుకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. అంతేకాదు ఢిల్లీలోని AAP ప్రభుత్వానికి కవిత(Kavitha) వందల కోట్ల రూపాయలు చెల్లించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.