ఏప్రిల్‌లో మొత్తం ధరలలో తగ్గుదల కారణంగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇండియాలో టోకు ధర బేస్ ద్రవ్యోల్బణం (WPI) మైనస్ లోకి మారిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో 1.34 శాతం నుంచి - 0.92%కి చేరుకుందని వెల్లడించింది.
అధిక రక్తపోటు(blood pressure) వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడి పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఆ క్రమంలో ఎడమ జఠరిక మందం సహా గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు వంటి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
పూరీ - హైదరాబాద్ మధ్య సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో పాటే దేశవ్యాప్తంగా మరో ఐదు లైన్లలో వందే భారత్ ను పట్టాలెక్కించనున్నారు.
ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రవత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట నాలో నేనే లేను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.
చెన్నై-బెంగళూరు ప్రాంతాల్లో వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కుప్పం సరిహద్దులోని బిస్సానత్తం స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ట్రైన్ లోని కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ట్రైన్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.
గూగుల్ మ్యాప్స్ కారణంగా 22 ఏళ్ల ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్లో శనివారం అర్ధరాత్రి జరిగింది.
ప్రభాస్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్.. ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అయిపోయాడు. కొన్ని నెలల కిందటే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఈ మధ్య శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో.. రామ్, బోయపాటి నుంచి ఓ ఊరమాస్ సినిమా రాబోతోంది. అయితే ఈ కాంబినేషనే షాకింగ్ అంటే.. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ మరింత షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రామ్(Ram pothineni) చేసిన సినిమాల్లో.. ఇది అంతకుమించి అనేలా ఉండబోతోంది. ప్రస్తుతం రామ్ షాకింగ్ లుక్ వైరల్ అవుతోంది.
చికెన్ మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కోడికూర ధరలు(Chicken prices) హైదరాబాద్లో(hyderabad) ఒక్కసారిగా పెరిగాయి. 200 రూపాయల నుంచి అమాంతం 250కు చేరాయి. దీంతో పలువురు మధ్యతరగతి ప్రజలు చికెన్ తీసుకునేందుకు వెనకాడుతుండగా..మరికొంత మంది మాత్రం రేటు పెరిగినా కూడా తగ్గేదేలే అంటున్నారు.
అన్నీ మంచి శకునములే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు స్టార్ హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ కూడా అటెండ్ అయ్యారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి మరి.
వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తుఫాన్ కారును లారీ ఢీ కొంది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
ఇక్కడ కనిపిస్తున్న షార్ట్ ధర అక్షరాలా రూ.90 వేలు. ఎందుకంత రేటు.. మామూలుగా షార్ట్ ధర అధికంగా 5వేల రూపాయలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ షార్ట్ ను సులబ్రిటీలు ఫిదా అయ్యూ ఇటాలియన్ బ్రాండ్ లోరో పియానా తయారు చేసింది. ఇందులో ఉపయోగించిన కాటన్ అత్యంత ఖరీదైనది. ఇలాంటి కాటన్ తో తయారుచేసిన ఓ తెల్ల రంగు షార్ట్ ను ఇటీవల రిలీజ్ చేసింది సదరు సంస్థ. ఇంట్లో, విహారయాత్రలకు వెళ్లినప్పుడు హాయిగా ఉ...