ఇక్కడ కనిపిస్తున్న షార్ట్ ధర అక్షరాలా రూ.90 వేలు. ఎందుకంత రేటు.. మామూలుగా షార్ట్ ధర అధికంగా 5వేల రూపాయలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ షార్ట్ ను సులబ్రిటీలు ఫిదా అయ్యూ ఇటాలియన్ బ్రాండ్ లోరో పియానా తయారు చేసింది. ఇందులో ఉపయోగించిన కాటన్ అత్యంత ఖరీదైనది. ఇలాంటి కాటన్ తో తయారుచేసిన ఓ తెల్ల రంగు షార్ట్ ను ఇటీవల రిలీజ్ చేసింది సదరు సంస్థ.
ఇంట్లో, విహారయాత్రలకు వెళ్లినప్పుడు హాయిగా ఉండటానికి ఇలాంటి షార్ట్స్ ను సెలబ్రిటీలు వాడతారు. వాల్మర్ బెర్ముడా షార్ట్స్ పేరిట రూపొందిన ఈ షార్ట్ ధర అక్షరాల రూ.90 వేలు. 70 శాతం నూలు, ఫ్లాక్స్ గా పిలిచే ప్రకృతి సిద్ధ ఫైబర్ ధారాలను కలిపి ఈ షార్ట్స్ ను తయారు చేసినట్లు చెప్పారు. దీనిని uk.loropiana.comలో ఆర్డర్ ఇవ్వవచ్చని సంస్థ ప్రతినిధుల తెలిపారు. వీటిని ఎండ కాలం ధరిస్తే వడగాలికి కూడా చల్లని గాలిని ఫిల్టర్ చేస్తుందని చెప్పారు. ఈ కాటన్ మెత్తగా పల్చగా ఒంటికి తగలడంతో ఎంతో హాయిని ఇస్తుందని చెప్పారు.
దీనికి తోడు ఫ్యాషన్ గా కనపడేందుకు మెత్తని మల్మల్ కాటన్ వస్త్రంతో గ్రాండ్ గా కనిపించేందుకు గరారాను రూపొందించింది ప్రీవిన్ సంస్థ. గ్రాండ్ గా కనిపించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పగటి పూట సూర్యుడిలా పసుపు వన్నెలో దర్శనమిస్తున్న ఈ డ్రెస్ అద్దాలతో పాటు ఎంబ్రాయిడరీని జతచేసింది.
విశాలమైన గేరా ఉండే గరారా ప్యాంట్ కు పెద్ద టాజిల్స్ తో వచ్చిన చిన్న టాప్స్, దుపాట్టా ప్రత్యేక ఆకర్శనలుగా నిలిచాయి. దీని ధర రూ.13,999. దీన్ని ogaan.com ద్వారా కొనుక్కోవచ్చు.