Lorry-Toofan collision:వైఎస్ఆర్ జిల్లాలో (ysr) ఘోర ప్రమాదం జరిగింది. తుఫాన్ (toofan) కారును లారీ బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికకక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం (anantapuram) జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకొని వాహనంలో ఇంటికి వస్తున్నారు. దారిలో కడప- తాడిపత్రి మెయిన్ రోడ్లో ప్రమాదం జరిగింది. కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగా వీరి వాహనాన్ని ఎదురుగా వస్తోన్న లారీ (lorry) బలంగా ఢీ కొట్టింది.
లారీ అదుపుతప్పి రావడంతో ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లారీ ఢీ కొనడంతో తుఫాన్ వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. అక్కడికక్కడే ఏడుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.