»Nara Lokesh Who Tied Mothers Nara Bhuvaneswari Shoe Lace Comments To Try Something New
Mother: తల్లి షూ లేస్ కట్టిన లోకేశ్..కొత్తగా ట్రై చేయాలని కామెంట్స్
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా కదలివస్తూ లోకేశ్ కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
మరోవైపు లోకేశ్ కుటుంబ సభ్యులు కూడా పాదయాత్రకు తరలివచ్చారు. ఆయనతో కలిసి నడిచారు. ఆ క్రమంలో పాదయాత్రలో భాగంగా తన తల్లి భువనేశ్వరి(bhuvaneswari) నడుస్తున్న క్రమంలో షూ లేస్ ఊడిపోయింది. వెంటనే గమనించిన నారా లోకేశ్ మోకాళ్లపై కూర్చుని తన తల్లి షూ కు లేస్ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కామెంట్లలో ఓ వ్యక్తి ఢిల్లీకీ రాజు అయిన తల్లికి కొడుకే రా బత్తాయి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో వ్యక్తి ఆకుల కట్టేం కాదని విమర్శిస్తూ పేర్కొన్నారు. మరో వ్యక్తి అయితే కొత్తగా ట్రై చేయాలని సోనియా గాంధీ షూ లేస్ కడుతున్న రాహుల్ ఫొటోను ట్యాగ్ చేసి మరి వ్యాఖ్యానించాడు.
జనవరి 27న తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఇది ఇప్పటివరకు 1,200 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజే లోకేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన బంధువు, నటుడు నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలారు. ఆ తర్వాత తారకరత్న (39) ఫిబ్రవరి 18న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే… అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… కోట్లాది ఆంధ్రుల ఆశాజ్యోతి నారా లోకేష్ గారు కూడా తన తల్లి దగ్గర పిల్లవాడు అయిపోయాడు. 100వ రోజు పాదయాత్రలో తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి గారి షూ లేస్ ఊడిపోగా ఆయనే స్వయంగా కట్టారు pic.twitter.com/TCI9l43OkT