Heat Waves : ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం
ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రవత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తీవ్రంగా వడగాల్పులు (Heat Waves) వీయనున్నట్లు విపత్తుల నిర్వహణ తెలిపింది. సోమవారం రాష్ర్టంలోని 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ ప్రభావం చేపే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గార్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 మండలాలు తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చేపనున్నాయి.
సోమవారం మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 42 – 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 34మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఏపీ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7 డిగ్రీల అధిక ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.