ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా ఇండియా జట్టు ఫైనల్ కాలేదు. పలువురు ఆటగాళ్లను ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు టీం గురించి సునీల్ గావస్కర్(sunil gavaskar) తనదైన శైలిలో స్పందించారు.
సమంతా(Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం “కుషి” పాటల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సామ్ పలు విషయాలను పంచుకుంది.
ఆప్గానిస్తాన్, ఇరాన్(Afghanistan and Iran) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆప్గానిస్తాన్ హెల్మండ్ నదిని రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ నదిపై ఆప్గాన్ విచ్చలవిడిగా డ్యాములు నిర్మించిందని వాటిని నాశనం చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత పునరుద్ధరణ పనులు జరిగిన వెంటనే ఒడిశా(odisha)లో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లా(Bargarh district)లో నమోదైంది. బర్గర్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలులోని పలు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్...
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.....
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.
తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో వైద్యురాలు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
టక్కర్ మూవీ(Takkar movie) ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని వెస్టిన్‌లో జూన్ 4న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అదే తేదీన జగనన్న విద్యా కానుక కిట్‌ల(Jagananna Vidya Kanuka kits)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(cm jagan mohan reddy) పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ద్వారా 39.95 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
బిహార్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈనెల 11న రాసే అభ్యర్థులకు TSPSC కీలక సూచనలు చేసింది. పరీక్ష రోజు ఉదయం 10.15 గంటలకు పరీక్షా కేంద్రంలోకి హాజరు కావాలని కోరారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు.
తమ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై చేసిన పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తనను, తన సన్నిహితులను ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు మరోమారు రౌడీ మూకలను జగన్ ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
కొండచరియలు విరిగి పడటంతో 19 మంది మృతిచెందిన ఘటన చైనాలో ఆదివారం చోటుచేసుకుంది. విరిగిపడ్డ కొండ చరియల ప్రాంతంలో 40 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్‌లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.