వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార వైసీపీ పార్టీ నేతలు దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి (BRS) ఎంపీ, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారధి రెడ్డి నేతృత్వంలోని సాయి సింధు ఫౌండేషన్ ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమికి హక్కు లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. రూ.500 కోట్లకు పైగా విలువైన భూమిని తక్కువ రుసుముతో లీజుకు తీసుకున్నారనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది.
భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
ఓ తల్లి తన నలుగురు పిల్లల్ని చంపడంతో ఆమెను సీరియల్ కిల్లర్‌గా కోర్టు ముద్ర వేసింది. అయితే 20 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తన పిల్లల్ని చంపలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ జైలు నుంచి విడుదల కానుంది.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మరో మూడు రోజుల పాటు ఏపీ(AP)లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
జూన్ 14వ తేది నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే మళ్లీ షూటింగ్(Shooting) స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ చేసే సినిమాల షూటింగులన్నీ ఇప్పుడు ఆగిపోనున్నాయి.
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. కృతి సనన్ సీతగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదఘటన ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వట్టిచెరుకూరులో జరిగింది. అయితే ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
పొంగులేటి ప్రజా శాంతి పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రిని చేస్తా కేఏ పాల్(KA Paul) క్రేజీ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఖమ్మం జిల్లాను 10 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేద్దామని వెల్లడించారు.
మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అనేక కుటుంబాల్లో ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడిచే పరిస్థితి ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా కొనాలన్నా, తీసుకోవాలన్నా ఆకస్మాత్తుగా అప్పులు చేయాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఫోన్ పొగొట్టుకున్న యువకుడు తండ్రిని మళ్లీ ఇబ్బందిపెట్టలేక బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ(borabanda)లో చోటుచేసుకుంది.