»Heavy Sun For Another Three Days Alert For People Of Ap
AP Temperature: మరో మూడు రోజులు భారీ ఎండలు.. ఏపీ ప్రజలకు అలెర్ట్
మరో మూడు రోజుల పాటు ఏపీ(AP)లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ ఏడాది రుతుపవనాలు(Monsoons) మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో వర్షపాతం లోటు పెరగనుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం, అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు వచ్చే వరకూ కూడా ఎండలు విపరీతంగా ఉండనున్నాయి. ఏపీలో అయితే మరీ దారుణంగా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.
మరో మూడు రోజుల పాటు ఏపీ(AP)లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలిపారు. సోమవారం ఏపీలోని 21 మండలాల్లో వడగాల్పులు వీచాయని, అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3 డిగ్రీలు నమోదైనట్లు తెలిపారు. ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కాజాలో 42.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదయ్యాయని మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా మజ్జిగ, మంచినీరు, తాజా పళ్ల రసాలు సేవించాలని కోరింది. అలాగే గొడుగును తమ వెంట తీసుకెళ్లాలని తెలిపారు. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించాలని, డీహైడ్రేట్(Dehydrate) కాకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు సేవించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపా