ఆచార్య దెబ్బకు ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను.. ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు కొరటాల శివ. కానీ అప్పుడే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే ప్రచారం జరుగుతునే ఉంది. కానీ ఎన్టీఆర్ 30 అప్టేట్ మాత్రం రావడం లేదు. జూన్ నుంచి వెనక్కి వెళ్తున్న ఈ సినిమా.. అక్టోబర్‌ను కూడా దాటేసింది. వాస్తవానికి ఈ దసరాకు షూటింగ్ అప్డేట్ ఇస్తారని భావించారు నందమూరి అభిమానులు. కానీ దసరా పోయింది.. దీపావళి వస్తోంది..
అయినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అంతేకాదు హీరోయిన్ విషయంలో కూడా ఇంకా డైలమాలోనే ఉన్నారట. అయితే స్క్రిప్ట్ కంప్లీట్ అయితే గానీ.. హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఇక ఎన్టీఆర్ 30 వెర్షన్ ఇలా ఉంటే.. కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తునే ఉన్నాయి. చాలా రోజులుగా నందమూరి బాలకృష్ణతో కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బలయ్య.. గోపీచంద్ మలినేనితో ఎన్బీకె 107 ప్రాజెక్ట్ చేస్తున్నారు.
ఆ తర్వాత అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయనున్నారు. ఇక ఆ తర్వాత కొరటాలతో సినిమా ఉంటుందని టాక్. బాలయ్య 108 అయిపోయేలోపు ఎన్టీఆర్ 30 కంప్లీట్ అవనుంది. కాబట్టి ప్రముఖ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రేజీ కాంబో ఫిక్స్ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోందట. అయితే ముందు ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళితే.. కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.