భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో వర్చువల్గా భేటీ కానున్నారు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించి పలు అంశాలపై సీఎంలకు అమిత్ షా సూచనలు చేసే అవకాశం ఉంది. పాక్ విషయంలో కేంద్రం నిర్ణయాలు, దానివల్ల ఎదురయ్యే పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.