GNTR: హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెనాలిలో బుధవారం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. పహల్గాంలో అమరులైన భారతీయ జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సహసంయోజకులు శ్రీనివాసులు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ ఉన్నారు.