ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన ఈ కీలక సమావేశంలో, ఆపరేషన్ సింధూర్ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలపై వారిరువురు చర్చించారు. సరిహద్దు భద్రత, నియంత్రణ రేఖ (LOC) వద్ద పరిస్థితులపై వారు సమాలోచనలు జరిపారు.