పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ధర్మశాలలో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు సింగర్ బి ప్రాక్ (ప్రతీక్ బచన్) ఆధ్వర్యంలో దేశ భక్తి గీతాలాపన నిర్వహించనున్నారు.