కృష్ణా: జగ్గయ్యపేట మండలంలోని మల్కాపురం గ్రామ సర్పంచ్ అంబోజి పుల్లారావు ( జాన్ ) ఆకస్మికంగా మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం జాన్ మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అయన వెంట పట్టణ కూటమినేతలు పాల్గొన్నారు.