భారత్‌లో తొలి అమెరికా విశ్వవిద్యాలయ క్యాంపస్‌గా ఇల్లినాయిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో స్థాపించబడనుంది. దీనికి యూజీసీ అనుమతి ఇచ్చింది. దీంతో ఇల్లినాయిస్ టెక్ భారత్‌లో డిగ్రీలు అందించే మొదటి అమెరికా వర్సిటీగా అవతరించనుంది. ఈ క్యాంపస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ నిర్ణయం ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుంది.