ASR: హుకుంపేట ఎంపీపీ కూడా రాజుబాబు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీవో నెంబరు-3కి ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకు రావాలని ఎంపీపీ రాజుబాబు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గిరిజన ప్రాంతంలో 100శాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని తీర్మానించారు.