ELR: వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామానికి చెందిన షకీల్ రెహ్మాన్ గురువారం నియమితులయ్యారు. వైసీపీ అనుబంధ విభాగాల నియామకంలో భాగంగా అధినేత వైఎస్ జగన్ రెహ్మాన్‌ను నియమించారు. పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వాసుబాబు పిలుపునిచ్చారు.