NTR: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు సమాజంలోని ప్రజలకి ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం చిట్యాలలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 14వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త మారెళ్ల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.