హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీలు నుదుటన అలంకరించుకునే సింధూరానికి చారిత్రక, సాంస్కృతిక, వైద్యపరమైన ప్రాముఖ్యతలున్నాయి. దీన్ని అదృష్టం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. సింధూ నాగరికత నుంచే ఈ సంప్రదాయం ఉంది. నుదుటిపై ఆజ్ఞా చక్రం అనే నాడీ మండల కేంద్రంలో దిద్దే ఈ సింధూరం మహిళల్లో ఏకాగ్రతను పెంచి, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.