NDL: బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల సంతపేట కాలనీకి చెందిన హుసేనాబాషా బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవన నిర్మాణ కార్మికుడైన ఇతడు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదని ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.