ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టడంతో పాకిస్తాన్ ప్రధాని షెహ్రబాజ్ షరీప్ సంచలన ప్రకటన చేశారు. అక్కడ జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ‘ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ఎలా బదులివ్వాలో పాకిస్తాన్కు తెలుసు. మరణించిన సాయుధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది’ అని పేర్కొన్నారు.