NLR: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. తిరుమల అభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.