KMM: తల్లాడలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీవ్ర నష్టం మిగిల్చిందని విలపించారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, గన్ని సంచులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.