GNTR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తాడేపల్లి ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) పిలుపునిచ్చింది. బుధవారం తాడేపల్లిలోని సీతానగరం, ప్రకాష్ నగర్, కుంచనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసులు అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.