అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో భారత్కు సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల మీదే ఆధారపడుతోంది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 242.4 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 60.23 డాలర్లకు చేరింది.