SDPT: సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.