రేపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్సులోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సమావేశం కానుంది. ఆపరేషన్ సింధూర్ వివరాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది. భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను వెల్లడించనుంది.