కన్నడ రాకింగ్ స్టార్ యష్ లేకుండా కేజీఎఫ్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టం. రాఖీభాయ్‌గా కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల్లో మాస్ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాడు యష్. బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. కన్నడ సినిమా స్టామినా ఏంటో చూపించాడు. అలాంటి హీరోని ప్రశాంత్ నీల్ పక్కకు పెట్టబోతున్నాడట. కెజిఎఫ్ 2 క్లైమాక్స్‌లో కెజిఎఫ్ 3 ఉంటుందని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. అప్పటి నుంచి ఈ హిట్ సీక్వెల్ ఎప్పుడుంటుందా.. అని చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. ఇటీవలే హొంబలే ఫిల్మ్ మేకర్స్.. కేజీఎప్ 3కు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత కెజీయఫ్ 3 ఉంటుందని.. విజయ్ కిరగందూర్ చెప్పుకొచ్చారు. యష్ కూడా కెజియఫ్ చాప్టర్ 2 తర్వాత.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు యష్. త్వరలోనే బిగ్ అప్టేట్ ఇవ్వబోతున్నట్టు.. తన బర్త్ డే సందర్భంగా చెప్పాడు. అయితే ఎలాగు కెజియఫ్ 3 లైన్లో ఉంది కాబట్టి.. నెక్స్ట్ ఇయర్ యష్ నుంచి ఈ ప్రాజెక్ట్ రావడం పక్కా అనుకున్నారు అభిమానులు. కానీ తాజాగా ఈ సినిమాలో యష్ ఉండడని చెప్పి షాకిచ్చాడట విజయ్ కిరగందూర్. కేజీఎఫ్ సీక్వెల్స్‌కి వేర్వేరు హీరోలు ఉంటారని చెబుతున్నాడట. అలాగే 2025లో చాప్టర్ 3 సెట్స్ పైకి వెళుతుందని.. 2026 తరువాతే రిలీజ్ అవుతుందని అంటున్నారట. దీంతో యష్ లేకుండా కెజిఎఫ్ను ఊహించుకోవడం కష్టమని.. కామెంట్ చేస్తున్నారు యష్ ఫ్యాన్స్.. అయితే దీనిపై ప్రశాంత్ నీల్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.