నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari). కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సరదాగా నవ్వులు పూయించే అనిల్ రావి పూడి, బాలయ్యని ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ సినీయర్ హీరో బాలయ్య(Nandamuri Balakrishna) భగవంత్ కేసరి మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుదీర్ఘ దసరా సెలవులకు ముందు ఈ మూవీని విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో బాలకృష్ణ దూకుడుగా కనిపిస్తున్నారు. అతను రెండు చేతుల్లో రెండు తుపాకీలతో క్రూరంగా నడుచుకుంటూ కనిపిస్తాడు. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌కి హెల్మ్ చేయడంతో, ఇందులో మంచి హాస్యం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. టైటిల్ రివీల్ టీజర్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.