»Heroine Madhavi Latha Shocking Comments On Balayya
Balayyaపై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna) సినిమా పై ఓ ఫేడవుట్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేయడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? బాలయ్య పై ఎందుకు అలాంటి షాకింగ్ కామెంట్స్ చేసింది?
Heroine madhavi latha shocking comments on Balayya
అప్పుడప్పుడు కొందరు హీరోయిన్లు స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా పూనమ్ కౌర్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తుంటుంది. ఇక శ్రీరెడ్డి అయితే హీరోలపై విరుచుకుపడుతుంటుంది. ఈ జాబితాలో హీరోయిన్ మాధవిలత(madhavi latha) కూడా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్నేహితుడా, నచ్చావులే లాంటి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. హీరోయిన్గా స్టార్డమ్ అందుకోలేకపోయింది. కానీ తనను మరిచిపోకుండా సినిమా హీరోలపై, పొలిటీషియన్స్ పై ఏదో ఓ రకంగా కామెంట్స్ చేస్తునే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి(bhagavanth kesari) మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలయ్య అమ్మాయిల గురించి చెప్పిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ అదిరిపోయింది.
తాజాగా ఇదే అంశం మాదవిలత(madhavi latha) సంచలన వ్యాఖ్యలు(comments) చేసింది. ప్రస్తుతం సినిమాలు లేకుండా.. బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న మాధవి..తాజాగా ఒక ఇంటర్వ్యూలో భగవంత్ కేసరి గురించి మాట్లాడింది. స్టార్ హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం మంచి కాన్సెప్ట్.. కానీ హీరోయిన్ని గ్లామర్‌గా చూపిస్తూ.. ఇలాంటి డైలాగ్స్ చెప్పకూడదు. అలా చేస్తే.. చేసేది శివపూజలు దూరేది ఇంకేదో అంటారు కదా.. అలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. సినిమాల్లో డైలాగ్స్ చెప్పేవాళ్ళు.. నిజ జీవితంలో కూడా పాటిస్తే బాగుంటుంది..అంటూ సెటైరికల్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ డైరెక్ట్‌గా బాలయ్య పేరు చెప్పకపోయినా.. ఇండైరెక్ట్‌గా బాలయ్యను విమర్శించినట్టుగానే.. ఆమె కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మరి దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.