ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) రెండో విజయం నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్(kkr) జట్టుకు మళ్లీ నిరాశ తప్పలేదు. హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన సెంచరీ చేయడంతో కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ముంబయి జట్టు డెత్ ఓవర్లలో బాగా ఆడింది. చివరి ఐదు ఓవర్లలో 45 పరుగులు మాత్రమే ఇచ్చి కోల్‌కతాను 200 కంటే తక్కువకు పరిమితం చేసింది.
ఇక 186 పరుగుల ఛేదనలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఇద్దరి మధ్య దూకుడుగా నిలిచిన ఇషాన్ కిషన్‌తో కలిసి ముంబైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబయి జట్టును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేయడంతో ముంబై 2.2 ఓవర్లు మిగిలి ఉండగానే పరుగుల వేటను పూర్తి చేసింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన ముంబయి ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ 58, సూర్య కుమార్ 43, తిలక్ వర్మ 30, టీం డెవిడ్ 24, రోహిత్ శర్మ 20 రన్స్ చేసి ఆకట్టుకున్నారు.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 22వ మ్యాచ్ ఆదివారం జరిగింది. నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. రోహిత్ శర్మకు కడుపునొప్పి కారణంగా కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ గేమ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌ను MI కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతోపాటు ముంబయి జట్టులో ఈరోజు కొత్తగా అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసి రెండో ఓవర్ల బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చారు.