»Modi Said Mann Ki Baat 100th Episode Cant Stay Away From People
Modi: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..ప్రజలకు దూరంగా ఉండలేను
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) హోస్ట్ చేస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఏప్రిల్ 30న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సైతం ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక అంశాలను పంచుకున్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “మన్ కీ బాత్(Mann Ki Baat)” 100వ ఎపిసోడ్ కార్యక్రమం రానే వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రొగ్రామ్ 100వ ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రేడీయో కేంద్రాల ద్వారా ప్రసారం జరిగింది. అంతేకాదు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా దీనిని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఇతరులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ జీ యొక్క మన్ కీ బాత్ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదు. ఇది మంచి సామాజిక మార్పు కోసం ఉద్యమమని కేంద్ర మంత్రి అమిత్ షా(amit shah) అన్నారు.
Union Home Minister Amit Shah and Maharashtra CM Eknath Shinde, along with others, listen to the 100th episode of #MannKiBaat in Mumbai, Maharashtra. pic.twitter.com/0cQ3j2ul4i
100వ ఎపిసోడ్లో భాగంగా ప్రధాని మోదీ(modi) గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా తాను నమ్మలేకపోతున్నానని.. ప్రతి ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ప్రతి నెల ప్రజల నుంచి ఎన్నో లేఖలు అందుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో ఫొన్లో మాట్లాడిన వ్యక్తులతో మళ్లీ ప్రధాని మోదీ మాట్లాడారు.
సీఎంగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడనని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. చాలా సార్లు ఒంటరితనం ఆవరించిందేని తెలిపారు. ఈ క్రమంలో సెల్ఫీ విత్ డాటర్ ప్రచారాన్ని ప్రధాని(PM) ప్రస్తావించారు. దీంతోపాటు ఛత్తీస్ గఢ్ స్వయం సహాయక సంఘాల పనిని గుర్తు చేశారు. మహిళాశక్తిని ప్రధాని కొనియాడారు. మరోవైపు కశ్మీర్లో కొనసాగుతున్న పెన్సిల్ స్లేట్ ప్రచారాన్ని కూడా మోదీ మెచ్చుకున్నారు. పెన్సిల్ స్లేట్ ఉద్యమం ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఎన్నో మార్పులకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని ప్రధాని తెలిపారు. నా ఆస్తి మొత్తం ఈ దేశ ప్రజలేనని.. వారికి దూరంగా ఉండలేనని ప్రధాని మోదీ(PM Modi) వెల్లడించారు.
మన్ కీ బాత్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోస్ట్ చేసే నెలవారీ రేడియో కార్యక్రమం. ఇది మొదటిసారి అక్టోబర్ 3, 2014న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారం చేయబడుతుంది. అంతేకాదు ఈ ప్రొగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా(world wide) భారీ అభిమానులను సంపాదించుకుంది. జనాదరణ పొందిన ఈ షో 100వ ఎపిసోడ్‌ను ఈ రోజు ఉదయం 11 గంటలకు (IST) ప్రసారం చేశారు. ఇది ప్రత్యేక ఎపిసోడ్ అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వినేందుకు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమం 22 భారతీయ భాషలు సహా 29 మాండలికాలతో పాటు మన్ కీ బాత్ ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషల(languages)లో ప్రసారం చేయబడుతుంది.
#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik creates sand art at Puri Beach, ahead of the 100th episode of PM Narendra Modi's monthly #MannKiBaat. pic.twitter.com/VIvmMsNABj