»Mann Ki Baat 100th Episode How Pm Narendra Modis Effort To Reach Out To Citizens Became A Hit
Mann Ki Baat 100 : చిరస్థాయిగా నిలువనున్న ‘మన్ కీ బాత్’.. ప్రసారానికి భారీ ఏర్పాట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహిస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. చరిత్రలో ఈ ప్రోగ్రాం చిరస్థాయిగా నిలిచిపోనుంది.
Mann Ki Baat 100 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహిస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. చరిత్రలో ఈ ప్రోగ్రాం చిరస్థాయిగా నిలిచిపోనుంది. ప్రధాని వందో మన్ కీ బాత్ కార్యక్రమ ప్రసారానికి ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) వరకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతినెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్ఇండియా రేడియో(Radio)లో ప్రసారం అవుతోంది. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది.
ఏప్రిల్ 30వ తేది ఆదివారం నిర్వహించబోయే 100 ఎపిసోడ్‌కి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మాటలను ఐక్యరాజ్యసమితి(United Nations) ప్రధాన కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్(Live Telecost) చేయనున్నారు. అంతే కాదు దేశ అగ్రనేత మాట్లాడే మాటలను ప్రజలతో పంచుకునే విషయాలను వినేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) ఆదివారం ముంబై(Mumbai)లోని విలేపార్లేలో మోదీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగాన్ని స్వయంగా విననున్నారు. అలాగే కండివాలిలో జరిగే లైవ్ రేడియో స్పీచ్‌కి మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) హాజరవుతారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ని దేశ ప్రజలతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రాలతో పాటు ..అన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కోట్లాది మంది వినేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.